అధికార పార్టీ అనుసరిస్తున్న కక్షపూరిత చర్యలను ఖండించిన మాడుగుల జనసేన

మాడుగుల నియోజవర్గం, జనసేన పార్టీ కార్యాలయం చీడికాడలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇటీవల జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా అక్రమంగా బనాయించిన కేసులో అరెస్టు అయిన జనసేన నాయకులకు ఈశ్వర్ సహకారంతో నియోజవర్గ నాయకులు మరియు జనసైనికులు ఆధ్వర్యంలో సన్మానం చేసి, తదుపరి నియోజకవర్గంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ కోసం మరియు జనసేన పార్టీ బలోపేతంకు సంబందించి చేయవలసిన కార్యక్రమాలు కోసం చర్చించి, ఇటీవల పవన్ కళ్యాణ్ మీద హైదరాబాదులో జరిగిన రెక్కీ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పవన్ కళ్యాణ్ కి పటిష్టమైన భద్రత కల్పించవలసిందిగా మాడుగుల నియోజకవర్గ నాయకులు మరియు జనసైనికులు డిమాండ్ చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ కి జరగరానిది ఏదైనా జరిగితే రాష్ట్రము అగ్ని గుండంలా మారుతుందని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించడం జరిగింది. మరియు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవసభకు స్థలాన్ని సమకూర్చిన గ్రామస్తుల పట్ల అధికార పార్టీ అనుసరిస్తున్న కక్షపూరిత చర్యలను మాడుగుల నియోజవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.