మోదకొండమ్మ అమ్మవారికి వినతి పత్రం సమర్పించిన మాడుగుల జనసేన

“విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ విషయంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి 25 మంది ఎంపీలు 6గురు రాజ్యసభ సభ్యుల తీరు, వ్యవహార శైలి మారి విశాఖ ఉక్కుని ప్రయివేటీకరణ చేయకుండా పోరాడే దైర్యం నింపాలని మాడుగుల మండలంలో ఘాటి రోడ్డు జంక్షన్ లో ఉన్న మోదకొండమ్మ అమ్మవారికి వినతి పత్రం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్లకార్డులు సమర్పించిన అరకు పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జి శ్రీ వంపూరి గంగులయ్య మరియు మాడుగుల నియోజకవర్గ జనసైనికులు.