కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 153వ జయంతి వేడుకలు

తాడిపత్రి, జాతిపిత మహాత్మా గాంధీ 153 వ జయంతి సంధర్భంగా తాడిపత్రి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి జాతిపిత మహాత్మా గాంధిజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిదంగా గాంధీజీ కలలు కన్న స్వరాజ్య స్థాపనకు జనసేన పార్టీ కృషి చేస్తుందని అలాగే జనసైనికులు గాంధీజీ ఆశయాలను సాధించడానికి కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కిరణ్, అయుబ్, రమణ, మణికంఠ, రసూల్, కొండా శివ, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.