వారి సేవలను కొనియాడుతూ మహేష్, చిరు ట్వీట్స్ !

నేడు అంతర్జాతీయ నర్స్ డే పురస్కరించుకొని పలువురు ప్రముఖులు వైద్య సిబ్బంది సేవలను కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సూపర్ స్టార్ మహేష్, మెగాస్టార్ చిరంజీవి సైతం వైద్య సిబ్బందిలో కీలక భాగమైన నర్సులను వారి సేవలను గుర్తుచేసుకున్నారు. వారి సేవా గుణం గొప్పది అంటూ ట్వీట్ చేయడం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి తరువాత వైద్య సిబ్బంది ప్రాముఖ్యత అవసరం ఎంతగానో పెరిగిపోయింది. ఏడాదికి పైగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నర్సులు కోవిడ్ రోగులకు నిరంతర సేవలు అందిస్తూ, అనేక మంది ప్రాణాలు కాపాడుతున్నారు. వాళ్ళ త్యాగ నిరతిని కీర్తిస్తూ చిరంజీవి, మహేష్ బాబు సోషల్ మీడియాలో సందేశాలు పోస్ట్ చేశారు.