ఎన్టీఆర్ కొరటాల మూవీ లేటెస్ట్ అప్డేట్

ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఆ ప్రకటన వచ్చినప్పటినుంచి కూడా సినిమాపై అంచనాలు ఎక్కువవుతున్నాయి.అయితే గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో జనతాగ్యారేజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాపై అంతకుమించి హైప్ క్రియేట్ అవుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈ నవంబర్ లో మొదలు అయ్యే అవకాశం ఉందట. అంతేకాక మిగతా నటి నటులకు సంబంధించిన వివరాలు త్వరలో చిత్ర యూనిట్ వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని యువ సుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.