మత్స్యకార సోదరులకు అండగా నిలబడతానని మాకినీడి శేషుకుమారి హామీ

పిఠాపురం నియోజకవర్గం, యు కొత్తపల్లి మండలం, ఉప్పాడ సూరాడ పేట గ్రామం నుండి మత్స్యకార సోదరులు పలు సమస్యలు నిమిత్తం పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి నివాసానికి వచ్చి వాళ్ల సమస్యలు తెలియపరచడం జరిగింది. మాకినీడి శేషుకుమారి మాట్లాడుతూ త్వరలోనే ఆ గ్రామం వచ్చి ఆ సమస్యల మీద పోరాటం చేసి మత్స్యకార సోదరులకు అండగా నిలబడతానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యు కొత్తపల్లి మండల ప్రెసిడెంట్ పట్టా శివ, దొడ్డి దుర్గాప్రసాద్, మెరుగు ఇజ్రాయిల్, సూరడా శ్రీను, బుర్రా సూర్య ప్రకాశరావు, గోపు సురేష్, సూరాడ పేట నాయకులు తదితరులు పాల్గొన్నారు.