గోకివాడ గ్రామ పర్యటనలో మాకినీడి శేషుకుమారి

పిఠాపురం రూరల్, జనసేన పార్టీ బలోపేతం దిశగా మంగళవారం పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి గోకివాడ గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్న గ్రామస్తులను కలిసి అత్యధికంగా ఆదరించే గోకివాడ గ్రామ ప్రజలకు ఎప్పుడూ.. రుణపడి ఉంటానని.. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజల మీద భారం మోపి బాదుడే బాదుడు అంటూ కరెంటు బిల్లులు, ఆర్.టి.సి రేట్లు పెంచి.. నిత్యావసర సరుకుల ధరలు అత్యధికంగా ఎన్నడూ లేనివిధంగా పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని.. వచ్చేది జనసేన ప్రభుత్వమే అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ప్రజలకి అండగా ఉండే నాయకుడని.. అధికారం లేకపోయినా ఆయన సొంత కష్టార్జితంతో 5 కోట్లు విరాళం, మరియు ఇప్పటం గ్రామ ప్రజలకు 50 లక్షలు ఇలాగే ఎన్నో ఇచ్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే కౌలురైతు భరోసా యాత్రలో భాగంగా పంట నష్టం భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయిన కౌలు రైతులకు ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు ఇప్పటికే బాధిత కుటుంబానికి అందజేశారు అని తెలియజేశారు. అలాగే గోకవాడ గ్రామంలో మెగా ఫ్యామిలీ వీర అభిమాని విశ్వనాథం సత్తిబాబు, విశ్వనాథం సుబ్బారావు లను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.