శిథిలావస్థలో ఉన్నఅంగన్వాడీ కేంద్రానికి నూతన భవనం నిర్మించండి: జనసేన డిమాండ్

*శిథిలావస్థలో నిర్మానుష్యంగా ఉన్న “ద్వారకపేట ఎస్.సి కాలని లోని అంగన్వాడీ కేంద్రం”.
*ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాన్ని దూరంగా ఉన్న వేరే పాఠశాలలో నిర్వహిస్తుండటంతో పోలేక ఇబ్బందులుపడుతున్న పిల్లలు, వారి తల్లులు.
*ఐ.సి.డి.ఎస్(ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్ మెంట్ సర్వీసెస్) అధికారులు” స్పందించి వెంటనే నూతన భవనాన్ని నిర్మించే దిశగా చర్యలు చేపట్టాలని “జన సేన పార్టీ విజ్ఞప్తి”

నర్సంపేట పట్టణంలోని “ద్వారకపేట 18 వ వార్డు ఎస్.సి కాలానిలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రం” గోడలు బీటలు వారి శిథిలావస్థకి చేరడంతో ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాన్ని దూరంగా ఉన్న ద్వారక పేటలోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తుండంతో పిల్లలు, వారి తల్లులు పోలేక ఇబ్బందులు పడుతున్నారని “జనసేన పార్టీ దృష్టికి రావడంతో నియోజకవర్గ నాయకుడు మేరుగు. శివ కోటీ యాదవ్” శిథిలావస్థలో నిర్మానుష్యంగా ఉన్న ఎస్.సి కాలాని లోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలు, వారి తల్లులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా “ఐ.సి.డి.ఎస్ సంబంధిత అధికారులు మరియు సి.డి.పి.ఓ (చైల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్) స్పందించి వెంటనే “పాత ప్రదేశంలోనే నూతన భవనం నిర్మించే విధంగా మరియు భవన నిర్మాణం పూర్తి అయ్యేలోపు దగ్గర లో ఉన్న ఏదేని గదులను అద్దెకు తీసుకుని అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహించాలని” జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువజన నాయకులు వంగ. మధు, ఒర్సు. రాజేందర్, ఇసురం. యాకూబ్, డేవిడ్, క్రియాశీలక సభ్యులు అందె. రంజిత్, తిప్పతి.రమేష్, మాధారపు.కృష్ణా, అజయ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.