ఆత్మకూరు జనసేన పార్టీలో చేజర్ల మండలం నుండి పలువురి చేరికలు

ఆత్మకూరు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆత్మకూరు జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ చేతుల మీదగా చేజర్ల మండల ఇంచార్జ్ బండి అనిల్ రాయల్ ఆధ్వర్యంలో చేజర్ల మండలం నుండి పలువురు జనసేన పార్టీలో చేరడం జరిగింది. నలిశెట్టి శ్రీధర్ పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ… జనసేన పార్టీకి యువకులే బలమని, రాబోయేది జనసేన ప్రభుత్వమేనని తెలియజేస్తూ నూతనంగా పార్టీలో చేరిన జనసైనికులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ప్రసాద్, హరిబాబు,హరీష్, బలరాం, కళ్యాణ్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.