ఉత్తర వాహిని లో డంపింగ్ యార్డ్ పై జనసేన నిరసన

నర్సీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త రాజన్న వీర సూర్య చంద్ర ఆధ్వర్యంలో సోమవారం ఆర్డిఓ ఆఫీస్ ముందు నిరసన తెలియజేసి ఆర్డిఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూర్య చంద్ర మాట్లాడుతూ నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో బలిఘట్టం ఉత్తర వాహిని వద్ద డంపింగ్ యార్డ్ లో వేస్తున్నటువంటి చెత్త రోడ్లపై వేస్తున్నారని అంతేకాకుండా వేసి ఇటువంటి చెత్త పైన వర్షపు నీరు చేరి మొత్తం వ్యర్థ జలం ఉత్తర వాహినిలో కలిసి కలుషితం అవుతుందని దీనివలన ప్రవాహానికి వ్యర్థ జలాలు తోడై పర్యాటకులు మరియు భక్తులు ఇబ్బంది పడుతున్నారని ఈ సమస్యపై వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలంటూ ఆర్డిఓ కి వినతి పత్రం అందించడం జరిగిందని అంతేకాకుండా నర్సీపట్నం గ్రామీణ ప్రాంతంలో గ్రామ కంఠం మరియు కొండ పోరంబోకు గడ్డ పోరంబోకు రోడ్డుకు ఇరువైపులా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి, తక్షణమే స్పందించి ప్రభుత్వ స్థలాలలో బోర్డులు ఏర్పాటు చేయవలసిందిగా జనసేన తరపున డిమాండ్ చేస్తున్నామని ఈ విషయం గూర్చి కూడా ఆర్డిఓ దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలియజేశారు. ఆర్డిఓ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు ఊది చక్రవర్తి, కొత్తకోట రామ శేఖర్, రేగుపండ్ల శివ, ఎర్ర ఈశ్వరరావు, ఉగ్గిన రమణ, జెర్రిపోతుల గోవింద్, శింగంపల్లి లోవ లక్ష్మి, ఖొన లక్ష్మి, జెర్రిపోతుల స్వరూప, మాకిరెడ్డి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.