పిఠాపురం నియోజవర్గం: పిఠాపురం శాసనసభ్యులు మరియు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గం ఆడపడుచులకు సాంప్రదాయ బద్ధంగా నిర్వహించే సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు 10,000 చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ హరిప్రసాద్ మాట్లాడుతూ.. పిఠాపురం ఆడపడుచులంటే పవన్ కళ్యాణ్ కు ఎనలేని అభిమానం అని వరలక్ష్మీ వ్రతం పూజ సందర్భంగా పసుపు కుంకుమతో పాటు చీర 22వ తేదీ శుక్రవారం ఉదయం 5 గంటల నుండి ప్రారంభమై అంబిక, బ్రమరాంబ, చాముండి, దుర్గ, ఈశ్వరి అని అనే 5 బ్యాచ్యువల్గా నిర్వహిస్తామని తెలియజేశారు. అనంతరం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ.. వరలక్ష్మీ వ్రతానికి మహిళా విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా డిపార్ట్మెంట్స్ వారితో మాట్లాడటం జరిగిందని, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని, అన్నిటినీ పరిశీలించామని వరలక్ష్మి వ్రతాలు సవ్యంగా నిర్వహించాలని తెలిజేసామని అన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్క కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం నిర్వహించడం జరుగుతుందని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా దివ్యజయంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ కె.కె, చక్రవర్తి, జిల్లా అధ్యక్షులు కాకినాడ డిసిసి బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, సీఐ జి.శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవి సూర్యప్రకాష్, గోదావరి తూర్పు డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, ఏలేరు ప్రాజెక్టు వైస్ చైర్మన్ వూట ఆదివిష్ణు, ఆంధ్రప్రదేశ్ శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకె జగదీష్, ఉభయగోదావరి జిల్లా మహిళా రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మి, చెల్లిబోయిన సతీష్, పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ బొజ్జ కుమార్, జనసేన నాయకులు, కార్యకర్తలు వీర మహిళలు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment