జనసేనపార్టీలో భారీ చేరికలు

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు, కక్కి గ్రామంలో జనసేన పార్టీ నాయకులు జంగిడే ఈశ్వర్రావు, బాలకృష్ణ, బాబూరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాడేరు జనసేనపార్టీ ఇన్ఛార్జ్ డా.వంపూరు గంగులయ్య హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రజలకు వైసీపీ ప్రభుత్వం చేసినంత మోసం ఇదివరకెన్నడూ ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. అన్ని రంగాల్లో ప్రజలను ప్రభుత్వం మోసం చేసిందని చివరికి గిరిజన జాతి మనుగడకు తీవ్ర నష్టం జరిగే చీకటి తీర్మానాలు చేసిందని, మన గిరిజన ప్రజాప్రతినిధులు మాత్రం మాకు పదవే ముఖ్యమని గిరిజన జాతిని వంచించిన ద్రోహులు వీళ్ళు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడగడానికొస్తారో వారి ఇంగితానికే వదిలేద్దామన్నారు. అసలు గిరిజనులు వైసీపీ ప్రభుత్వం గిరిజనులపై అవలంబించే వాస్తవ రాజకీయాలు గమనిస్తే వైసీపీ పార్టీ కనుమరుగు కావడం ఖాయమన్నారు. జనసేనపార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి పెద్దగరువు, ఈదులపాలెం, సలుగు, పొడుగుపుట్ట, కక్కి, కందులపాలెం, కొత్తూరు గ్రామాలకు చెందిన ప్రజలు జనసేనపార్టీలో చేరారు. ఈ చేరికలో కక్కి గ్రామ జనసేనపార్టీ నాయకులు సహకారం మరువలేనిది ఈ కార్యక్రమంలో జంగిడే ఈశ్వర్రావు, సోమేలి బాబూరావు, బాలకృష్ణ, బాలరాజు, చిన్నారావు, సతీష్, వంపూరు సురేష్, మజ్జి నగేష్, మాదేల నాగేశ్వరరావు, చందు తదితర జనసైనికులు పాల్గొన్నారు.