కాకినాడ రూరల్: జనసేనలో భారీగా చేరికలు

కాకినాడ రూరల్ నియోజకవర్గం: కరప మండలం, ఉప్పలంక గ్రామానికి చెందిన వైసీపీ, టీడీపీకి చెందిన మహిళలు, యువత, పెద్దలు సుమారు 40 మంది ఉప్పలంక గ్రామ అధ్యక్షులు సంగడి శ్రీను, మరియు స్థానిక నాయకులు రేఖాడి రాము, లక్ష్మణ్, గంగాధర్ ఆధ్వర్యంలో కాకినాడ గొడరిగుంట జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ స్వగృహం వద్ద ఆయన సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి సాధారంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు, నచ్చి.. వైసీపీ ప్రభుత్వం యువతకి ఎటువంటి భరోసా కల్పించలేదని, ఇచ్చినమాట తప్పారని, మత్స్య కారులకి ఎటువంటి ఆదరణ లేదని, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చెయ్యాలని వీరంతా పార్టీలో చేరారని, రాబోయే కాలంలో పార్టీలో క్రియశీలకంగా మారి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజా సమస్యలఫై పోరాటం చేయాలని తెలిపారు.. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీలో చేరిన వారు: కాటాడి నాగమణి, లంకడి దేవి, రేఖడి కుసుమ, మల్లాడి కౌసల్య దేవి, చెక్క లక్ష్మి, ఎం. దనకాసులు, పంటాడి ధర్మారావు, అరదడి వీరబాబు, సేరు సురేష్, పిట్ట ప్రకాష్, బొమ్మిడి సతీష్, పాలేపు వీరబాబు, పాలేపు భైరవస్వామి, మల్లాడి నూకరాజు, పోతబత్తుల దుర్గా ప్రసాద్, పోతబత్తుల పెద్దరాజు, మల్లాడి వీరబాబు, గేదెల బాలు, పంతాడి శ్రీను, నాట్రూ చంద్రరావు, కర్రీ ప్రసాద్, చెక్క తాతబ్బాయి, రేఖడి కామేశ్వరరావు, బొడ్డు సత్తిబాబు, సంగడి ప్రసాద్, కోలాటి దుర్గా రావు, పాలేపు వెంకటేష్, అంగడి రాజు తదితరులు.. ఈ కార్యక్రమంలో కరప మండలం అధ్యక్షులు బండారు మురళి, రాష్ట్ర సహాయ కార్యదర్శి బోగిరెడ్డి గంగాధర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి తాటికాయల వీరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి శిరంగు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.