సీరమ్ ఇన్‌స్టిట్యుట్‌లో భారీ అగ్ని ప్రమాదం..

మహారాష్ట్రలోని పూణే సీరమ్ ఇన్‌స్టిట్యుట్‌ ఆఫ్ ఇండియాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టెర్మినల్ 1 గేట్ వద్ద ఉన్న బిల్డింగ్‌లోని రెండో అంతస్తులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. కాగా, కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్‌ను సీరమ్ ఇన్‌స్టిట్యుట్ తయారు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంతో వ్యాక్సిన్ తయారీకి ఎలాంటి ఇబ్బంది లేదని సంస్థ పేర్కొంది.