పద్మ అవార్డుల ప్రదానం..! పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న పీవీ సింధు

ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా పద్మ పురస్కారాల ప్రదానం జరిగింది. రాష్ట్రపతి భవన్​లో జరిగి ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

2020 ఏడాదికి పలు రంగాల్లో విశేష సేవలందించిన మొత్తం 119 మందికి పద్మ పురస్కారాలు ఇచ్చారు. వీరిలో ఏడుగురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మ భూషణ్, 102 మందికి పద్మశ్రీ అందజేశారు.

2016 రియో ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించి ‘వెండి కొండ’ తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించిన పీవీ సింధు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతుల మీదుగా పూసర్ల వెంకట సింధు పద్మవిభూషన్ అవార్డు అందుకున్నారు. 2020 సంవత్సరానికి గాను పీవీ సింధుకి పద్మవిభూషణ్ అవార్డు వరించింది. ఒలింపిక్ ప్లేయర్ పుసర్ల వెంకట సింధు రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో సిల్వర్ పతకం గెలవగా.. ఇటీవల టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్‌లో ఆమె బ్రాంజ్ మెడల్‌ను గెలుచుకుంది సింధు. 2015లో సింధుకు పద్మశ్రీ అవార్డు దక్కింది.

కాగా..పీవీ సింధుకి 2012 సెప్టెంబరు 21 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన స్థానాల్లో మొదటి 20 క్రీడాకారిణుల జాబితాలో చోటు దక్కించుకోవడంతో మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఆగస్టు 10 న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్ లో పతకం సాధించి, ఆ పతకం గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. 2015 మార్చి 30 న సింధుకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రధానం చేసింది. 2016 ఆగస్టు 18 న రియో ఒలింపిక్స్ లో జరిగిన సెమీఫైనల్లో జపాన్ కు చెందిన నోజోమీ ఒకుహరాను ఓడించి ఒలింపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. తరువాత జరిగిన ఫైనల్లో రజత పతకం సాధించి, ఒలింపిక్స్ లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా, అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా నిలిచింది పీవీ సింధు.