బొలిశెట్టి శ్రీనివాస్ మరియు తోట గోపి ఆధ్వర్యంలో జనసేనలోకి భారీ చేరికలు

తాడేపల్లిగూడెం నియోజకవర్గం 28వ వార్డు కర్రగట్టు సమీపాన సుమారు 50 మందికి పైగా సీనియర్ నాయకులు తోట గోపి ఆధ్వర్యంలో వానపాల సర్వేశ్వరరావు అధ్యక్షతన తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావజాలం, సిద్ధాంతాలు నచ్చి అక్కడి వార్డు ప్రజలకు జనసేన కండువాలు కప్పి సాదరంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తోట గోపి మాట్లాడుతూ నేను గత పది సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని మొన్న జరిగిన హఠాత్పరిణామంలో ఈ వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం అంతలో పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలిపి వారి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి అక్కడే జనసేన-టిడిపి పోత్తుని ఖరారు చేయడం, అలానే రైతులకు 100 మందికి పైగా తన సొంత కష్టార్జితం లక్ష రూపాయలు చొప్పున ఇవ్వడం అలానే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీను కరోనా టైంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రజలకు జనసేన పార్టీలో ఓడిపోయిన లక్షల రూపాయలతో సేవ కార్యక్రమాలు చేయడం వెనకడుగు వేయకుండా జనసేనలోనే నిలబడటం శ్రీను ధైర్యం గొప్పదని అన్నారు. అలానే మన డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అవినీతి గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రజలు దగ్గరుండి చూస్తున్నారని ప్రతి ఇంటిదగ్గర ఎమ్మెల్యే అవినీతి చిట్టా ఉందని ఏడ్డోవ చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మన బొలిశెట్టి శ్రీనివాస్ కి నా నుంచి మద్దతు ఉంటుందని తోట గోపి అన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నా మిత్రుడు తోట గోపి 10 సంవత్సరాల నుంచి రాజకీయాలకు దూరంగా ఉండి ఇప్పుడు వచ్చి మద్దతు తెలపడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. జనసేన పార్టీ తరుపున పవన్ కళ్యాణ్ చేస్తున్న మంచి కార్యక్రమాలు నచ్చి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వస్తున్న అతిష్ట స్పందన ప్రజల్లో సాధారణ మార్పు తీసుకువస్తుందని రాజకీయాలకు దూరంగా ఉండే ప్రజలు కూడా ఇప్పుడు ఇలా జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ప్రజలకు మేము కూడా సేవ చేస్తామని ఈ వార్డు ప్రజలు నాతో అనడం చాలా సంతోషంకరంగా ఉందని అన్నారు. జనసేనలోకి చేరిన వాళ్లందరికీ సముచిత గుర్తింపు, ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసే దుర్మార్గపు చర్యలకు అతీతంగా ఈరోజు జనసేనలో చేరిన వాళ్లందరినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, మండల అధ్యక్షులు పుల్లాబాబి, జనసేన నాయకులు సజ్జ సుబ్బు, మద్దాల మణికుమార్, గుండమోగుల సురేష్, కేశవభట్ల విజయ్, బయనపాలేపు ముఖేష్, మాదాసు ఇందు, రౌతు సోమరాజు, మరకపాక చిట్టి, గట్టిమ్ నాని, నీలపాల దినేష్, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్,సాయిరాం, సోమ శేఖర్, పవన్ కుమార్, నాగ వెంకటేష్, శివ, మురళి, నాగేశ్వర్రావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.