గొల్లల మామిడాడలో మెగా రక్తదాన శిబిరం

అనపర్తి నియోజవర్గం: పెదపూడి మండలం, గొల్లలమామిడాడలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు పరిష్కరించుకుని మంగళవారం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా తలసేమియా పిల్లల కొరకు లయన్స్ క్లబ్ మరియు చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ పర్యవేక్షణలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ రామారావు మాట్లాడుతూ లైన్స్ క్లబ్ చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుందని, మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా భారత దేశంలో రక్తదానం గురించి ఒక చైతన్యం తీసుకు వచ్చిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని అన్నారు. రక్తదాన శిబిరం అనంతరం కేక్ కటింగ్ నిర్వహించా. ఈ కార్యక్రమంలో రావాడ నాగు, మండరాజారెడ్డి, ద్వారంపూడి సూర్యనారాయణ రెడ్డి, వీరబాబు, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు.