జనసేనాని జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు మెగా వైద్య శిబిరం

గజపతినగరం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు మెగా వైద్య శిబిరం మెగా వైద్య శిబిరం మరుపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. పీజిస్టార్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జనరల్ ఫిజీషియన్ ఆర్థోపెటిక్ వైద్యులచే వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది, ఉచితంగా షుగర్, బిపి పరీక్షలు, మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మర్రాపు సురేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏ ఆశయంతో అయితే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారో, ప్రజలకి సేవ చేయాలని ఆలోచనతో ఆయన ఆలోచనలకు అనుగుణంగా ప్రజాసేవ కార్యక్రమాలు నిత్యం చేస్తున్నాము. గ్రామీణ ప్రాంతంలో సరైన వైద్య సదుపాయం లేక మధ్యతరగతి కుటుంబాలు సమస్యలపై నిత్యం బాధపడుతూ ఉంటారు, అలాంటి వారికోసం ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు రవికుమార్ మిడతన, గజపతినగరం నాయకులు, మహేష్, సత్యనారాయణ, హరీష్, అనిల్, పండు, శ్రీను, సురేష్ రెడ్డి జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.