రియల్ హీరో అనిపించుకొన్న మెగా మేనల్లుడు

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాను మెగా హీరోను మాత్రమే కాదు రియల్ హీరో అని కూడా నిరూపించుకున్నాడు. తన మంచి మనసును ఘనంగా చాటుకున్నాడు. విజయవాడలోని ‘అమ్మ ప్రేమ ఆదరణ సేవ’ వృద్ధాశ్రమాన్ని నిర్మించాడు. అంతేకాదు ఓ సంవత్సరం పాటు దానికి అవసరమయ్యే ఖర్చులను భరించేందుకు ముందుకు వచ్చాడు.

2019లో తన జన్మదినోత్సవం సందర్భంగా సాయితేజ్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేశాడు. విజయవాడలోని ఓ వృద్ధాశ్రమం నిర్వాహకులు తనను సంప్రదించారని, అసంపూర్తిగా ఉన్న తమ బిల్డింగ్ నిర్మాణానికి సహాయం చేయాల్సిందిగా కోరారని తెలిపాడు. తాను దానికి అంగీకరించానని, మెగా ఫ్యాన్స్ కూడా చేతనైనంత సహాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఒక లక్ష రూపాయలు వరకు సాయం చేశారట. ఇక వారి సాయానికి సాయి తేజ్ తోడై ఆ వృద్ధులకు ఒక ఇంటిని అందించారు. ఇచ్చిన మాట ప్రకారం సాయి తేజ్ తన అసిస్టెంట్స్ చేత ఆ గృహ నిర్మాణాన్ని పూర్తి చేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇపుడు బయటకు వచ్చాయి. ఇక ఇపుడు పూర్తి కాబడిన ఈ ఇంటికి మరియు వారికి ఒక ఏడాది పాటు ఆర్ధికంగా అండగా నిలుస్తానని సాయి తేజ్ వెల్లడించాడు.