పాలక్కడ్ నుంచి బరిలోకి దిగనున్న మెట్రో శ్రీధరన్

తిరువనంతపురం : బీజేపీ తన కేరళ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదివారం ఈ జాబితాను ప్రకటించారు. మెట్రోమ్యాన్ శ్రీధరన్ పాలక్కడ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారని అరుణ్ సింగ్ ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కుమ్మనన్ రాజశేఖరన్ నెమోన్ నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ మాత్రం రెండు స్థానాల నుంచి బరిలోకి దిగుతున్నారు.మంజేశ్వర్, కొన్ని నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్నారు. మొత్తం 115 స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగనుంది. మిగితా 25 స్థానాల నుంచి మిత్రపక్షాలు పోటీలోకి దిగుతున్నాయి.