పోలవరం, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆదివాసీ సంక్షేమం పట్ల తన నిబద్ధతను మరోసారి చాటారు. ఆగస్టు 9న జరగనున్న ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా కార్యక్రమాల నిర్వహణకు ఆయనకు చెందిన సిబిఆర్ ట్రస్టు ద్వారా రూ.2 లక్షలు విరాళంగా ప్రకటించారు. గురువారం ఏలూరు జిల్లాలోని కేఆర్ పురం ఐటీడీఏ కార్యాలయంలో ఏడుమండలాల అధికారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ఆదివాసీలకు విద్య, వైద్యం, జీవనోపాధి అవకాశాలు కల్పించడమే నిజమైన అభివృద్ధి. వారి సాంస్కృతిక విలువల పరిరక్షణకు సమిష్టిగా కృషి చేయాలి,” అని పేర్కొన్నారు. దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు.

Share this content:
Post Comment