*బ్రహ్మ కుమారీస్ వారిచే రక్షా బంధన్ కట్టించుకున్న ఎమ్మెల్యే బత్తుల
రాజానగరం, బ్రహ్మ కుమారీస్ – రాజమండ్రి వారి బృందం రక్షా బంధన్ పండుగను పురస్కరించుకొని, అన్నా, చెల్లి, అక్కా, తమ్ముడుల బంధాన్ని తెలియపరిచే నేపథ్యంలో రాజానగరం నియోజకవర్గం శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆఫీసుకి చేరుకొని, బలరామకృష్ణ మరియు వారి సిబ్బందికి చక్కని సంప్రదాయ పద్ధతిలో నుదుటిన బొట్టును పెట్టి, హారతి ఇచ్చి, మిఠాయి తినిపించి రాఖీలను కట్టారు. అనంతరం బలరామకృష్ణ ఆనందంతో, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని దీవించారు. ఇప్పుడే కాదు, తాను ఎల్లప్పుడూ ఆడపడుచులందరికి అండగా ఉంటానని మాట ఇచ్చారు.
Share this content:
Post Comment