పి. గన్నవరం, అయినవిల్లి మండలం, అయినవిల్లి గ్రామం మగపు వారి పేటకు చెందిన జనసైనికుడు వడ్డీ దుర్గాప్రసాద్ మృతి చెందారు. ఈ విషాద వార్త తెలుసుకున్న పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ, దుర్గాప్రసాద్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దుర్గాప్రసాద్ గారి అకాల మరణం అయినవిల్లి మండలం జనసేన పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment