పి.గన్నవరం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలం కుందలపల్లి గ్రామంలో సుమారు 1.1 కిలోమీటర్ పొడవుతో రూ.77.30 లక్షల వ్యయంతో నిర్మించబోయే బీటీ రోడ్డుకు పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామస్తులు తమ డ్రైనేజీ సమస్యను తన దృష్టికి తీసుకువచ్చారని, దానిపై సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే ఆ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలో మిగిలి ఉన్న రోడ్ల పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment