వరద విపత్తులో సినీ హీరోలే స్పందిస్తారా ఎమ్మేల్యేలు పట్టించుకోరా: అరుణ రాయపాటి

ఏపి వరద విపత్తులో ఉంటే సినీ ఇండస్ట్రీ నుండి స్పందన ఉందిగాని, ఎమ్మేల్యేలు ఎవరు స్పందించలేదని జనసేన ధ్వజమెత్తింది. దీనిపై ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి అరుణ రాయపాటి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు సినిమా ఇండస్ట్రీ నుంచి మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ అలాగే మహేష్ బాబు మరియు జూనియర్ ఎన్టీఆర్ అందరూ వరద విపత్తుల కోసం ఒక్కొక్కరు 25 లక్షలు ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్న మీడియా సంస్థలు కావచ్చు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్ కి డబ్బులు ఇచ్చారా అవినీతితో కోట్లు సంపాదించే రాజకీయ నాయకులు ఎందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కు డబ్బులు ఇవ్వరు సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంతలా హీరోలు ముందుకు వచ్చి సహాయం చేస్తుంటే ప్రభుత్వంలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు అలాగే ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ఎమ్మెల్యేలు ఎందుకు వరద విపత్తుల సమయంలో సహాయ సహకారాలు అందివ్వరు అని ధ్వజమెత్తారు.