నమ్మదగిన వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే మరికొంత సమయం: నిపుణుడు ఆంనీ

కరోనా వ్యాక్సిన్ వస్తే ఒక్క ఏడాదిలో పరిస్థితి మారిపోతుందని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంనీ ఫాసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా కారణంగా ఉత్పన్నమైన పరిస్థితులన్నీ సర్దుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే నమ్మదగిన వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే మరికొంత సమయం పడుతుందని, 2021 ఆరంభంలో కరోనా వ్యాక్సిన్ వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. మానవులు అంటువ్యాధులపై పూర్తిస్థాయి ఆధిపత్యం సాధించిన సందర్భాలు చాలా తక్కువ అని, గతంలో అమ్మవారు వ్యాధిపై మాత్రమే మానవులు పైచేయి సాధించారని, మిగతా వ్యాధులను మాత్రం అదుపులో ఉంచగలిగారని ఫాసీ వివరించారు.