పెనికేరులో జనసేన ఆధ్వర్యంలో దోమల నివారణ చర్యలు

ఆలమూరు మండలంలోని, పెనికేరు గ్రామంలో దోమలు విజృంభనతో గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఇది గమనించిన జనసేన నాయకులు సుమారు 20వేలు వెచ్చించి స్వచ్చందంగా దోమలు నివారణ చర్యలు చేపట్టారు. ఈ మేరకు తొలిరోజు పలువార్డుల్లో ఎం.ఎల్.ఆయిల్ ను పిచికారీ చేశారు. దింతో వారి ఉదారతకు పలువురు గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.