ముకేశ్‌ అంబానీ లండన్‌కు మకాం మార్చడం లేదు: రిలయన్స్‌ ఇండిస్టీస్‌

రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుటుంబం లండన్‌లో నివాసముండబోతుందని సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న వార్తలు నిరాధారమైనవని రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ పేర్కొంది. ముకేశ్‌ అంబానీ కుటుంబం లండన్‌ లేదా ప్రపంచంలో మరెక్కడా మకాం మార్చడానికి లేదా నివసించడానికి ఎలాంటి ప్రణాళికలు లేవని, లండన్‌లోని స్టోక్‌ పార్క్‌లో అంబానీ కుటుంబం నివాసం ఉంటుందని సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమైనవని రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ స్పష్టం చేసింది.