కోల్‌కతాపై ముంబై గెలుపు

ఐపీఎల్‌ 2020లో లో భాగంగా అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఘనవిజయం సాధించింది.  టైటిల్ ఫేవరెట్‌గా సీజన్‌ను ఆరంభించిన రోహిత్ సేన తన హవాను కొనసాగిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యాన్ని 19 బంతులు మిగిలుండగానే చేధించి అద్భుత విజయం అందుకుంది.

స్వల్ప లక్ష్యమే అయిన ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు ముంబై ఓపెనర్లు. ముఖ్యంగా డికాక్ (78) ధాటిగా ఆడితే రోహిత్ అతడికి సహకారం అందించారు. 36 బంతుల్లో 35 పరుగులు చేసి రోహిత్ ఔటైనా డికాక్ తన జోరును కంటిన్యూ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 10 పరుగులు చేసి ఔటైనా ముంబై విజయం అప్పటికే దాదాపుగా ఖరారైపోయింది. ముఖ్యంగా డికాక్ ఏ మాత్రం ఛాన్స్ దొరికనా ఫోర్‌ లేదా సిక్స్‌ కొట్టి కోల్ కతా బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. చివరలో హార్దిక్ కూడా తనదైన శైలీలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకపడటంతో ముంబై విజయం ఖాయమైంది. డికాక్ 44 బంతుల్లో 3 సిక్స్‌లు,9 ఫోర్లతో 78 పరుగులు చేయగా హార్ధిక్ 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కెప్టెన్ మోర్గాన్(39), కమిన్స్(53) ఆదుకోవడంతో కేకేఅర్ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. కాగా, ఈ మ్యాచ్ విజయంతో ముంబై ఇండియన్స్ మళ్లీ టేబుల్ టాపర్స్ అయ్యారు.