ప్రజల కోసం పనిచేయాలి: ఎమ్మెల్యే బొలిశెట్టి

తాడేపల్లిగూడెం, పెద్ద తాడేపల్లి, వెంకటరమణ గూడెం రామన్నగూడెం, చిన్న తాడిపల్లి గ్రామాలకు సంబంధిత సొసైటీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందున కృతజ్ఞతలు తెలుపడానికి వచ్చిన పరిమి వెంకటకృష్ణ (సురేష్) తాడేపల్లిగూడెం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను కలిశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు, మెంబర్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా అలంపురం, ప్రత్తిపాడు, కృష్ణయ్య పాలెం గ్రామాలకి సొసైటీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా పారిచర్ల ప్రసాద్ వారి సొసైటీ బోర్డు మెంబర్లతో తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలతో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వీరందరికీ శాలువా కప్పి సన్మానం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ.. కూటమిలో భాగంగా మీకు ఇచ్చిన ఈ పదవి ప్రజల కోసం, రైతుల కోసం ఆర్నిస్టులు కష్టపడి పని చేయాలని, కూటమి పట్ల విశ్వాసంతో ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా నడుచుకోవాలని, మీ పనితీరు ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా అన్నారు.

Share this content:

Post Comment