థియేటర్లు ఓపెన్.. హాల్ అంతా ఖాళీ

అన్ లాక్-5.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి నుండి లబించడంతో దాదాపు ఏడు నెలల తర్వాత మళ్లీ నిన్నటి నుండీ ఢిల్లీ సహా మరికొన్ని రాష్ట్రాల్లో సినిమా హల్స్ ఓపెన్ చేశారు. కొత్తగా ఏ సినిమాలూ రిలీజ్ కాకున్నా పాత సినిమాలనే మళ్లీ వేసేందుకు సిద్ధపడ్డారు సినిమా హాల్ ఓనర్లు. ఇలా పాత సినిమా వేసేందుకు టికెట్ కౌంటర్ తెరిచిన ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్ ఏరియాలో ఉన్న ఓ థియేటర్ యాజమాన్యానికి చేదు అనుభవం ఎదురైంది.

థియేటర్ లోని సగం సీట్లకే బుకింగ్ ఇవ్వాలని ప్రభుత్వం పెట్టిన నిబంధన ప్రకారం మొత్తం 300 సీట్లు ఉన్నా 150కి మాత్రమే టికెట్లు పెట్టారు. అయితే కేవలం నలుగురంటే నలుగురు మాత్రమే టికెట్లు కొన్నారు. ఉదయం 11.30కి స్టార్ట్ చేయాల్సిన షో దాదాపు అరగంట ఆలస్యంగా మొదలు పెట్టినా ఎవరూ అటు అడుగు కూడా పెట్టలేదు. దీంతో ఏం చేయలేక థియేటర్ అంతా ఖాళీగానే ఉన్నా వచ్చిన నలుగురికే షో వేశారు. మధ్యాహ్నం 2.30 గంటల షో వేసేటప్పటికైనా జనం పెరుగుతారన్న ఆశపడ్డాడో ఏమో మళ్లీ టికెట్ బుకింగ్ తెరిచినా ఐదుగురు మాత్రమే వచ్చారు.

థియేటర్ కి వచ్చిన ఓ వ్యక్తిని ప్రశ్నించగా ‘కరోనా రాకుండా పాటించాల్సిన జాగ్రత్తలు ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చా’ అని, ఆ కుతూహలంతోనే టికెట్ కొని సినిమా చూడాలని వచ్చానని చెప్పాడు.