*సామాజిక న్యాయానికి ప్రతీకగా పెనుమాల లక్ష్మి
పి. గన్నవరం, మామిడికుదురు మండలం, నగరం గ్రామ చరిత్రలో మరో మైలురాయి నమోదైంది. నగరం మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్‌గా శ్రీమతి పెనుమాల లక్ష్మి బాలరాజు, వైస్ చైర్మన్‌గా గుడాల వెంకటరమణ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రజల మనసులను ముద్దాడేలా, అత్యంత వైభవంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ స్వయంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రముఖమైన ఈ వేడుకకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ, అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పణతో ప్రారంభమై, ఊరేగింపుగా మార్కెట్ యార్డ్ వరకు సాగింది. తీన్మార్ డప్పుల, జెండాల, నినాదాల మధ్య సాగిన ర్యాలీ కొత్త ఉత్సాహాన్ని నింపింది. సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “దళితుల పట్ల ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నిబద్ధతకు ఇది బలమైన నిదర్శనం. ఆత్మవంచనలు, అవమానాలను ఎదుర్కొన్న పెనుమాల లక్ష్మి గారికి ఈ గౌరవ స్థానం లభించడం ద్వారా జనసేన సామాజిక న్యాయాన్ని వాస్తవంగా అమలు చేస్తోంది,” అన్నారు.
అలాగే, “జగన్‌ను పాతాళానికి పంపకపోతే నేనే పవన్ కళ్యాణ్ కాదు” అన్న నాయకుడి నమ్మకం నేడు ఫలితంగా కనిపిస్తున్నదని అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని, ఆగిపోయిన సంక్షేమ పథకాలు మళ్లీ ప్రజలకు చేరుతాయని పేర్కొన్నారు. కోనసీమ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన జనంతో ఈ వేడుక ఘనంగా మారింది.
ఈ చారిత్రాత్మక ఘట్టం, అంబేద్కర్ ఆశయాలకు భద్రతగా, పవన్ కళ్యాణ్ నాయకత్వానికి బలంగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment