పెన్నా బ్రిడ్జి పూర్తి వినియోగానికి మోక్షం ఎప్పుడో?.. పవనన్న ప్రజాబాటలో నలిశెట్టి శ్రీధర్

  • పవనన్న ప్రజాబాట 15వ రోజు

ఆత్మకూరు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయాలన్న ఏకైక ఉద్దేశంతో తలపెట్టిన పవనన్న ప్రజాబాట 15వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణాన్ని దక్షిణ ప్రాంతానికి కలిపే బొగ్గేరు, పెన్నా నదులపై బ్రిడ్జిలు నిర్మించి పుష్కరకాలం కావస్తుంది. కొన్ని వందల కోట్ల రూపాయల వ్యయంతో ఈ రెండు బ్రిడ్జిలను నిర్మించడం జరిగింది. బద్వేల్, ఉదయగిరి, కనిగిరి, పామూరు మొదలగు పట్టణాలను తిరుపతి మరియు చెన్నై నగరాలకు ఆత్మకూరు గుండా కలిపే ప్రధానమైన బ్రిడ్జి ఇది. ఈ బ్రిడ్జి ద్వారా రాకపోకలు సాగిస్తే ప్రయాణ దూరం తగ్గడమే కాకుండా ఆత్మకూరు ప్రధాన కేంద్రంగా తయారవుతుంది. కానీ ఈ ప్రాంత అభివృద్ధి పట్ల పాలకుల నిర్లక్ష్య ధోరణి కారణంగా అప్పారావు అప్పారావు పాలెం బ్రిడ్జి నుండి ఆత్మకూరు పట్టణానికి కలిపే అప్రోచ్ రోడ్డు నిర్మించని కారణంగా బ్రిడ్జి పూర్తిగా వినియోగంలోనికి రాలేదు. ఆత్మకూరు అభివృద్ధికి ఎంతగానో దోహదపడే ఈ అప్రోచ్ రోడ్ ను వెంటనే నిర్మించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. పవనన్న ప్రజా బాట 15వ రోజు కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని పేరారెడ్డి పల్లెలో పర్యటించి ప్రజల ఇబ్బందులను తెలుసుకొని.. వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సురేంద్ర, చంద్ర, వంశీ, పవన్, ప్రశాంత్, మస్తాన్ వలీ, ప్రసాద్, రాజు, హజరత్, నాగరాజు, అనిల్, భాను కిరణ్ తదితరులు పాల్గొన్నారు.