అమలాపురం మార్కెట్ యార్డు చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లను సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ నాయకురాలు అధికారి జయ వెంకటలక్ష్మి, వైస్ చైర్మన్ గా జనసేన నాయకులు పరమట చిట్టిబాబు, డైరెక్టర్ గా జనసేన నాయకులు నూకల రాజా, పిల్లా ప్రసాద్, జనసేన వీర మహిళ మొటూరి కిరణ్ సొదరి సుభాషిని మరియు తెలుగుదేశం నాయకులు డైరెక్టర్లుగా నియమింపబడ్డారు. జనసేన తరపున వైస్ చైర్మన్ గా, డైరెక్టర్ గా నియమింపబడ్డ జనసేన నాయకులను అమలాపురం జనసేన నాయకులు నల్లా శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించారు. అమలాపురం మార్కెట్ యార్డ్ నియమింపబడ్డ జనసేన నాయకులను అమలాపురం జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అభినందించారు.
Share this content:
Post Comment