మోపిదేవి జనసేన అధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవ వేడుక

అవనిగడ్డ నియోజకవర్గం: మోపిదేవి మండల జనసేన అధ్వర్యంలో డిసెంబర్ 23, శుక్రవారం జాతీయ రైతు దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది. వేడుకలో భాగంగా మోపిదేవి మండల జనసేన అధ్వర్యంలో మోపిదేవి మండల జనసేన అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్ అధ్యక్షతన కోసూరువారిపాలెం గ్రామంలో రైతులవద్దకు వెళ్లి వ్యవసాయ రంగంలో రైతులు ఎదురుకొంటున్న సమస్యలు మరియు వారు ఆరుగాలం పండించిన పంటలు గురించి అడిగి తెలుసుకుని గత మరియు నేటి ప్రభుత్వలు ఎన్నికల్లో ఓట్ల కోసం రైతులకు అనేక హామీలు ప్రకటించి నేటికీ ఏ ఒక్క ప్రభుత్వం సుదీర్ఘ కాలం ఉపయోగపడే పని ఒక్కటైనా కూడా నెరవేర్చలేదని ఈ సందర్భంగా రైతులు వారి బాధలను వెల్లడించారు.. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి వరకు ఎలాంటి అధికారం లేకపోయినా రైతులకి అండగా జనసేన పార్టీ లా ఏ రాజకీయ పార్టీ లేదు అని, అలాగే రైతుల కోసం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయ చరిత్రలో సరికొత్తగా ఎలాంటి అధికారం లేకపోయినా రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న 3000 మంది కౌలు రైతుల యొక్క కుటుంబ సభ్యులకు లక్ష రూపాయలు చొప్పున 30 కోట్ల రూపాయలు ఆర్థిక బరోసా ఇచ్చారని, అలాగే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ప్రతి నియోకవర్గంలోనూ అధికంగా కూరగాయ పంటలు పండే చోట శీతల గిడ్డంగులు నిర్మిస్తారని, రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా జనసేన పార్టీ వ్యవసాయ రంగంలో కొత్త చట్టాలను తీసుకొస్తుందని మత్తి వెంకటేశ్వరరావు వివరించి, గ్రామంలో ఉన్న రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మోపిదేవి మండల కమిటీ నాయకులు, మోపిదేవి మండల స్థాయి నాయకులు, వీరమహిళలు, గ్రామ నాయకులు, జనసైనికులు పాల్గొని విజయంతం చేశారు.