జాతీయ క్రీడా దినోత్సవ పోటీలు

*పోటీలకు గొల్లవిల్లి విద్యార్థుల ఎంపిక

అమలాపురం, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు 29న జరగనున్న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా అండర్‌-22 వయస్సు గల పురుషులు, మహిళల కోసం 10 క్రీడాంశాలలో జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిలలో పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా జట్ల ఎంపిక జి.ఎం.సి. బాలయోగి స్టేడియంలో జరిగింది. గొల్లవిల్లి ఉన్నత పాఠశాల నుంచి వాలీబాల్ బాలికల జట్టుకు 6 మంది, వెయిట్ లిఫ్టింగ్‌కు 1, హాకీ బాలుర జట్టుకు 11 మంది, హాకీ బాలికల జట్టుకు 16 మంది ఎంపికైనట్లు హెచ్‌.ఎం. జి. కనకదుర్గ తెలిపారు. ఎంపికైన విద్యార్థులు కాకినాడలో జరిగే జోనల్-2 స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా హైస్కూల్ యాజమాన్య కమిటీ చైర్మన్ వాలా సత్యనారాయణ మూర్తి, ప్రధానోపాధ్యాయురాలు గొకరకొండ కనకదుర్గ, వ్యాయామ ఉపాధ్యాయురాలు సరస్వతి మరియు సిబ్బంది అభినందనలు తెలిపారు.

Share this content:

Post Comment