*శాసన సభ్యులు దేవ వరప్రసాద్
రాజోలు, ఆంధ్రప్రదేశ్ రైతులను సంక్షేమ బాటలో ఎన్డీఏ ప్రభుత్వం నడిపిస్తుందని రాజోలు నియోజకవర్గ శాసనసభ్యులు దేవ వరప్రసాద్ అన్నారు. లక్కవరం వేణుగోపాల థియేటర్ నుండి మలికిపురం గాంధీ సెంటర్ వరకు జరిగిన రైతు కృతజ్ఞత ర్యాలీలో ముఖ్య అతిథిగా దేవ వరప్రసాద్, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ సభ్యులు పేరా బత్తుల రాజశేఖర్, పరిశీలకులు చిటికెల రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం 100 రైతుల ట్రాక్టర్లతో ర్యాలీగా మల్కిపురం గాంధీ సెంటర్ వరకు వచ్చి విగ్రహాలకు పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు దేవ వరప్రసాద్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి నాయకులు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పెంచిన సామాజిక పెన్షన్ లను ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేసిందని, ఉచిత గ్యాస్ సిలిండర్లను ప్రజలకు అందజేస్తుందని, తల్లికి వందనం ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం బిడ్డలందరికి 15 వేల రూపాయల చొప్పున తల్లులు ఖాతాలో జమ చేయడం జరిగిందని, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుకు సంవత్సరానికి 20వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలలో జమ చేస్తామని చెప్పిన మాట ప్రకారం మొదటి విడతగా ఇటీవల ప్రతి రైతు ఖాతాలలో 7 వేల రూపాయలు చొప్పున జమ చేయడం జరిగిందని అన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా భావించే చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాబోయే రోజులలో రైతులకు సంక్షేమాన్ని పూర్తిగా అమలు చేసి రైతుని తల ఎత్తుకొని తిరిగేలా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ సంవత్సర కాలంలో పవర్ టిల్లర్స్, వ్యవసాయ పనిముట్లు, డ్రోన్ ద్వారా స్ప్రే చేసే పరికరాలను, రైతులకు సబ్సిడీపై అందజేయడం జరుగుతుందని రైతును ఒక మహరాజులా చూడాలని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. శాసన మండలి సభ్యులు రాజశేఖర్ మాట్లాడుతూ.. గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో రైతుకు సమృద్ధిగా వ్యవసాయానికి నీరు కూడా అందజేయలేని పరిస్థితిలో పనిచేసిందని, ఎక్కడ ఒక తట్టు మట్టి కూడా తీసిన దాఖలాలు గత ఐదు సంవత్సరాలలో జరగలేదని, కూటమి ప్రభావం వచ్చిన తర్వాత ఇప్పటికే కాలువలను బాగు చేయడం డ్రైనేజీలను బాగు చేయడం, రైతుకు సమృద్ధిగా వ్యవసాయానికి సరిపడే నీళ్లను అందజేయడం జరుగుతుందని ఇది రైతు ప్రభుత్వం అని అన్నారు. రాబోయే రోజుల్లో రైతును పూర్తిగా ఆదరించి వారికి కావలసిన సహకారాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, రైతు సోదరులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share this content:
Post Comment