నరేంద్రమోదీకి నేపాల్‌ ప్రధాని శుభాకాంక్షలు

భారత ప్రధాని నరేంద్రమోదీకి పుట్టిన రోజు సందర్బంగా నేపాల్‌ ప్రధాని కేపీశర్మ ఓలీ ప్రధాని నరేంద్రమోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. రెండుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు పని చేయడం కొనసాగిస్తామని పేర్కొన్నారు.