గ్వాలియర్ రాజమాత బొమ్మతో కొత్త రూ.100 నాణెం

ఇండియన్ కరెన్సీ లో మరో వంద రూపాయల నాణెం వచ్చి చేరింది. గ్వాలియర్ రాజమాత విజయరాజే సింధియా జయంతి ఉత్సవాల సందర్భంగా సింధియా గౌరవార్దం ప్రధాని మోదీ సోమవారం ఉదయం రూ. 100 నాణేన్ని విడుదల చేశారువిడుదల.

దేశ చరిత్రలో గ్వాలియర్ రాజవంశానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ రాజవంశపు రాజమాత విజయరాజే సింధియా అంటే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కు ఎనలేని గౌరవం. అందుకే గ్వాలియర్ రాజమాత జన్మశతాబ్ది ఉత్సవాల సందర్బంగా..ఆమె గౌరవార్ధం కొత్త వంద రూపాయల నాణేన్ని ప్రధాని మోదీ వర్చ్యువల్ కార్కక్రమంలో విడుదల చేశారు.

కేంద్ర ఆర్ధిక శాఖ ఈ కొత్త వంద రూపాయల నాణేన్ని రూపొందించింది. నాణేనికి ఓ వైపు రాజమాత విజయరాజె సింధియా బొమ్మ ఉంటుంది. మరోవైపు అశోకుడి స్థూపం ఉంటుంది. విజయరాజె సింధియా బొమ్మ ఉన్న వైపు..సింధియా వందవ జయంతి అని హిందీ, ఆంగ్లభాషల్లో రాసి ఉంటుంది. స్వయంగా ఆర్ధిక శాఖనే ఈ కాయిన్ డిజైన్ చేసింది.

తన జీవితాన్ని పేద ప్రజల కోసం అంకితం చేసిన గ్వాలియర్ రాజమాత విజయరాజె సింధియా..స్వాతంత్ర్యోద్యమం నుంచి రాజకీయాల వరకూ పయనించి కీలకపాత్ర పోషించారని ప్రదాని మోదీ తెలిపారు. అంతేకాకుండా ఏక్తాయాత్ర సమయంలో నాడు విజయరాజె సింధియానే తనను గుజరాత్ యువ నాయకుడిగా పరిచయం చేశారంటూ గుర్తు చేసుకున్నారు.