కూటమి పాలనలో గిరిజన ప్రాంతాలకు కొత్త వెలుగులు

*రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ

రాజానగరం, ప్రాచీనచరిత్రకు, సంస్కృతికీ, సంప్రదాయాలకు, నిరాడంబరతకు నిలువుటద్దంగా నిలిచే జీవన శైలి ఆదివాసుల సొంతం.. ప్రకృతి మాత బిడ్డలైన గిరిపుత్రులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ తూర్పు గోదావరి జిల్లా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలలో భాగంగా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ నుండి వై జంక్షన్ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ. అనంతరం ఆదివాసీ సాంప్రదాయ నృత్యం చేస్తున్న విద్యార్థులతో కలిసి నృత్యం చేసి అందరినీ ఆశ్చర్యపరిచి విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపిన బత్తుల బలరామకృష్ణ అనంతరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ.. మానవ మనుగడకు దారులు చూపిన మూలవాసులు “ఆదివాసీలు” అడవి తల్లికి తోడుండే అసలైన భూమి పుత్రులు గిరిజనులన్నారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే గిరిజన ప్రాంతాల్లో నూతనాధ్యాయం ఆరంభమైందన్నారు.. ఏజెన్సీ జిల్లాల్లోని ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుక్షణం కృషి చేస్తోందన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రభుత్వం ఎజెన్సీ ప్రాంతాలు మైదాన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్.డి.ఏ కూటమి నాయకులు, జిల్లా అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-08-09-at-4.10.43-PM-1024x768 కూటమి పాలనలో గిరిజన ప్రాంతాలకు కొత్త వెలుగులు

Share this content:

Post Comment