ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి నుంచే కొత్త వేతనాలు!

ఈ జనవరి నెల నుంచే 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త సంవత్సరం కానుక అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన డీఏ, డీఆర్ అందించాలని యోచిస్తోంది. జనవరి నుంచే ఉద్యోగులతో పాటు 61 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుందని సమాచారం. డీఏ, డీఆర్ పెంపు వల్ల సుమారు 61 లక్షల మంది పెన్షనర్లు సైతం ప్రయోజనం పొందనున్నారు. వాస్తవానికి గత డిసెంబర్‌లోనే కేంద్రం నుంచి ప్రకటన వస్తుందని ఉద్యోగులు భావించారు.

ప్రస్తుత 28 శాతం ద్రవ్యోల్బణ రేటు ప్రకారం కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్ పెంపును ప్రకటించే అవకాశం ఉందని రిపోర్టులు ప్రచారంలో ఉన్నాయి.  ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై అసోసియేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్స్ అండ్ వర్కర్స్ ఆర్థిక మంత్రి నిర్మళా సీతారామన్‌కు తెలియజేసింది. దీంతో ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటు 28 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డీఏ మరియు డీఆర్ మంజూరు చేయాలని ఆమెకు సూచించినట్లు సమాచారం.

కోవిడ్ -19 సంక్షోభం కారణంగా జూలై 2021 వరకు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 61 లక్షల మంది పెన్షనర్లకు డీఏని పెంచాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ గత ఏప్రిల్‌లో నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కు డీఏను 4 శాతం 21 శాతానికి పెంచడానికి కేంద్ర మంత్రివర్గం గతంలోనే ఆమోదం తెలిపింది. కానీ ఈ పెంపును గత కొన్ని నెలలుగా నిలిపివేశారు. తాజాగా ఈ మొత్తాన్ని జనవరి జీతంతో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.