కరోనాను జయించి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన న్యూజిలాండ్

ప్రపంచం మొత్తం విలయతాండవం చేస్తూ విహరిస్తున్న కరోనాను న్యూజిలాండ్ దేశం దాదాపుగా కట్టడి చేసి నిర్మూలించిoదనే చెప్పవచ్చు. ఈ నిర్మూలనకు ఆ దేశ ప్రధాని వయసులో చిన్న వారైనప్పటికీ కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఎంతగానో కృషి చేశారు. 39 సంవత్సరాల జకిండా ఆర్డర్న్ కట్టుదిట్టమైన లాక్ డౌన్ అవలంబించి కరోనా రక్కసితో ఎంతో చాకచక్యంగా పోరాడి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచారు అని చెప్పడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఇప్పటి వరకు దేశంలో నమోదైన కరోనా కేసులు 2000 లోపే అంటే ఆమె కృషి ఏమిటో చెప్పవచ్చు. ఈరోజు న్యూజిలాండ్ దేశమంతటా ప్రజలందరూ ఆటపాటలతో సంతోషంగా ఉన్నారు అంటే ఆ దేశ ప్రధాని కృషే కారణం.