అమెరికాలో ఇక మాస్కు అక్కర్లేదు: సీడీసీ కొత్త మార్గదర్శకాలు

న్యూయార్క్‌: అమెరికాలో వ్యాక్సినేషన్‌ పూర్తయిన వాళ్లు ఇకపై మాస్కుల్లేకుండానే బయట తిరగొచ్చుఅయితే, వ్యాక్సినేషన్ పూర్తయిన వాళ్లకు, ఒక డోసు తీసుకున్న వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ మేరకు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నిన్న కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఇకపై వారు మాస్కు ధరించకుండానే బహిరంగ ప్రదేశాల్లో తిరగొచ్చు. ఒంటరిగా కానీ, కుటుంబ సభ్యులతో కానీ కలిసి నడకకు, షికారుకు వెళ్లొచ్చు. అయితే, జనాల గుంపులోకి వెళ్లేటప్పుడు మాత్రం మాస్కు ధరించడమే మేలని సీడీసీ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే, ఒక్క డోసు కూడా వేసుకోని వారు మాత్రం బయటకు వస్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేసింది.