25 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల: ECIL HYDERABAD (రాత పరీక్ష లేదు)

హైద‌రాబాద్ ప్ర‌ధానకేంద్రంగా ఉన్న ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) ఫిక్స్‌డ్ టెన్యూర్ కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న 25 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ http://careers.ecil.co.in/login.php చూడొచ్చు.

మొత్తం పోస్టులు: 25

టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌ – 9

సైంటిఫిక్ అసిస్టెంట్‌ – 8

టెక్నిక‌ల్ అసిస్టెంట్‌ – 1

జూనియ‌ర్ ఆర్టిజన్‌ – 7

ఒప్పంద కాలం: ప్రాథమికంగా రెండేళ్లు. తర్వాత అవసరాన్ని బట్టి పొడిగించే అవకాశముంది.

విద్యార్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత ట్రేడుల్లో/ స‌బ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా (ఇంజినీరింగ్‌), ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: ఆగస్టు 31, 2020 నాటికి టెక్నికల్‌ ఆఫీసర్ పోస్టులకు 30 ఏళ్లు, మిగిలిన వాటికి 25 ఏళ్లు మించకూడదు.

అనుభవం: కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

వేతనం: టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులకు నెలకు రూ.23,000, సైంటిఫిక్ అసిస్టెంట్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ.19,864, జూనియ‌ర్ ఆర్టిజన్ పోస్టులకు రూ.18,070 ఉంటుంది.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేది: త్వరలో ప్రకటిస్తారు. ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌ చూసుకుంటూ ఉండండి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: ఆగస్టు18, 2020

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:http://careers.ecil.co.in/login.php