BEL 549 పోస్టులకు నోటిఫికేషన్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీ (BEL) కి దరఖాస్తులు కోరుతోంది. బెంగళూరు కేంద్రంగా పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే కాంట్రాక్ట్ విధానంలో మొత్తం 549 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ (HR), ట్రెయినీ ఇంజనీర్, ట్రెయినీ ఆఫీసర్ (ఫైనాన్స్‌) విభాగాలలో పోస్టులు ఉన్నాయి.

కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు

ప్రాజెక్ట్ ఇంజనీర్: 118 పోస్టులు

ప్రాజెక్ట్ ఆఫీసర్ (HR): 05 పోస్టులు

ట్రెయినీ ఇంజినీర్: 418 పోస్టులు

ట్రెయినీ ఆఫీసర్ (ఫైనాన్స్‌): 08 పోస్టులు

దరఖాస్తు ఫీజు: ట్రైనీ ఇంజినీర్/ట్రైనీ ఆఫీసర్ పోస్టులకు రూ.200 చెల్లించాలి. ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్‌ పోస్టులకు రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.

దరఖాస్తుకు తుది గడువు: 25.11.2020

పూర్తి వివరాల కోసం వెబ్ సైట్ https://bel-india.in/

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆయా పోస్టులు బట్టి అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ/ బీఆర్క్ ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ/ ఎంఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణులై ఉండాలి. అకడమిక్ మెరిట్‌, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.