కోర్టు అసిస్టెంట్స్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కోర్టు అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం 30 ఖాళీలు

కోర్టు అసిస్టెంట్‌ (జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌)

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/ ట్రాన్స్‌లేషన్‌ కోర్సు సర్టిఫికెట్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం రెండేళ్ల ట్రాన్స్‌లేషన్‌ అనుభవం ఉండాలి. కంప్యూటర్‌ ఆపరేషన్స్‌లో పరిజ్ఞానం ఉండాలి.

వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, టైపింగ్‌ టెస్ట్‌, వైవా ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

పరీక్ష విధానం: ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. ఇందులో రాతపరీక్షకు 150 మార్కులు, టైపింగ్‌ టెస్ట్‌కు 20 మార్కులు, వైవాకు 30 మార్కులు కేటాయించారు. రాత పరీక్షలో జనరల్‌ ఇంగ్లీష్‌, జనరల్‌ నాలెడ్జ్‌ 30 మార్కులకు, ఇంగ్లీష్‌ నుంచి సంబంధిత రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ భాషలోకి ట్రాన్స్‌లేషన్‌కు 60 మార్కులు, రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ భాష నుంచి ఇంగ్లీ్‌షలోకి ట్రాన్స్‌లేషన్‌కు 60 మార్కులు కేటాయించారు. ఇంగ్లీ్‌షలో నిమిషానికి 35 పదాలు, ప్రాం తీయ భాషలో నిమిషానికి 25 పదాల చొప్పున టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి. ఇందులో ఇంగ్లీష్‌ టైపింగ్‌కు 10 మార్కులు, ప్రాంతీయ భాషకు 10 మార్కులు కేటాయించారు. అన్ని పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేపడతారు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు చివరి తేది: మార్చి 13

వెబ్‌సైట్‌: https://main.sci.gov.in/recruitment