CEL లో మేనేజర్‌, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సీఈఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 6 లోపు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది.

మొత్తం పోస్టులు: 8

ఇందులో సీనియర్ మేనేజర్‌-1

మేనేజర్‌-3

అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్‌-2

డిప్యూటీ ఇంజినీర్‌-1

అకౌంట్స్ ఆఫీసర్‌-1

అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో బీఈ లేదా బీటెక్, సీఏ లేదా ఐసీడబ్ల్యూఏ, ఎల్ఎల్‌బీ, పర్సనల్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా చేసి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

అప్లికేషన్ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి పీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 6

దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 6

పూర్తి సమాచారం కొరకు వెబ్‌సైట్: www.celindia.co.in