అమెరికాలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్.. వ్యాక్సిన్‌ తీసుకుని అస్వస్థతకు గురైన మహిళా డాక్టర్

కొవిడ్‌-19 నిర్మూలనకు వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కొనసాగుతుంది. ఇందులో భాగంగా అమెరికాలో ఫైజర్ బయోఎన్ టెక్ కొవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్న మెక్సికోకు చెందిన ఓ 32 ఏళ్ల వైద్యురాలు అస్వస్థతకు గురైంది. మహిళా డాక్టర్ కేసును తాము అధ్యయనం చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. వ్యాక్సిన్ తీసుకున్న మహిళ డాక్టర్‌కు స్వల్ప అస్వస్థత లక్షణాలు కనిపించినట్లు తెలిపారు. ఆమెలో మూర్ఛ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మంపై దద్దుర్లు రావడంతో న్యూవో లియోన్‌లోని ఓ ప్రభుత్వ హాస్పిటల్‌లోని ఐసీయూకు తరలించినట్లు పేర్కొన్నారు. ప్రాథమిక నిర్ధారణ ప్రకారం.. ‘ఎన్సెఫలోమైలిటిస్’తో వైద్యురాలు బాధపడుతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.