బొబ్బిలి వీణ ప్రాంగణాన్ని మాత్రమే నిర్మించాలి: బాబు పాలూరు డిమాండ్

  • బొబ్బిలి అమ్మిగారి కోనేరు గట్టు, బలిజిపేట రోడ్డు కూడలి దగ్గర బొబ్బిలి వీణ ప్రాంగణాన్ని మాత్రమే నిర్మించాలి – జనసేన పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు డిమాండ్

బొబ్బిలి నియోజకవర్గం: బొబ్బిలికి ప్రసిద్ది గాంచిన వాటిలో మన వీర బొబ్బిలికి చిహ్నంగా నిలిచిన బొబ్బిలి వీణకు భారత ప్రభుత్వం నుండి భౌగోళిక సూచిక 2011 ట్యాగ్ వచ్చింది. అప్పటి నుంచి బొబ్బిలి వీణకు, బొబ్బిలి వీణను తయారు చేస్తున్న మన గొల్లపల్లి కళాకారులకు దేశంలో నలుమూలల నుంచి ఆర్థికంగా ఆశ్రయం, ఆదరణ దక్కుతున్నాయి. ఇలాంటి తరుణంలో అమ్మిగారి కోనేరు గట్టు బలిజిపేట రోడ్డు కూడలి దగ్గర బొబ్బిలి వీణ ప్రాంగణంను మాత్రమే పెట్టి బొబ్బిలి ప్రసిద్ధిని కాపాడాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు బొబ్బిలి మున్సిపల్ కమీషనర్ గారికి, ఆర్ & బి అధికారులకు కోరడం జరిగింది. ఇదిలా ఉండగా అమ్మిగారి కోనేరు గట్టు దగ్గర ప్రస్తుతానికి వైఎస్సార్ విగ్రహం వుండగా మళ్ళీ ఇంకో వైఎస్సార్ విగ్రహం కొత్తగా ఆ కూడలిలో పెడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. పబ్లిక్ ప్రాపర్టీ లో ఇలా ఏ విధంగా అధికార పార్టీ వారి నచ్చిన విగ్రహాలు పెడతారని, దానికి మీ కార్యాలయం ఏ ప్రాతిపదికన అనుమతులు మరియు నిధులు మంజూరు చేస్తున్నారని బొబ్బిలి మునిసిపల్ కమిషనర్ గారిని అడగడం జరిగింది. ఒకవేళ నిజంగా ఆ కూడలిలో బొబ్బిలి వీణను మాత్రమే కాకుండా, వైఎస్సార్ విగ్రహాన్ని పబ్లిక్ ప్రాపర్టీ అయినటువంటి ఆ కూడలిలో వైసిపి వారు తమ అధికార జులుం ఉపయోగించి పెడితే గనుక జనసేన పార్టీ తీవ్రంగా పరిగణించి, విపక్షాలన్నిటినీ కలుపుకుని ప్రజల మద్దతుతో తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తామని తెలియజేసారు. సదరు మున్సిపల్ అధికారులు పబ్లిక్ ప్రాపర్టీలో ప్రజామోదమైన బొబ్బిలి వీణ ప్రాంగణాన్ని మాత్రమే ఆ అమ్మిగారి కోనేరు గట్టు బలిజిపేట రోడ్డు కూడలిలో ఏర్పాటు చేసి పట్టణంలోని ప్రజల ఆకాంక్షను నిజం చేసి, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెర్లాం మండల అధ్యక్షులు మరడాన రవి, పళ్లెం రాజా, పొట్నూరు జన, గణేష్, కళ్యాణ్, అలజంగి జనసైనికులు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.