తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో జనసేన కార్యాలయ ప్రారంభం

పెనమలూరు నియోజకవర్గం జనసేన పార్టీ తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షులు తాతపూడి గణేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు విజయవాడ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు ముఖ్యఅతిథిగా పాల్గొని జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా చేతుల మీదుగా జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, ఉమ్మడి కృష్ణాజిల్లా నాయకులు, పెనమలూరు నియోజకవర్గ తాడిగడప మున్సిపాలిటీ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.